ప్రపంచ సంపన్నుల జాబితాలో భారత్ నుండి రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ మరోసారి నిలిచారు. బ్లూమ్‌బర్గ్ బిలియనీర్స్ లిస్ట్ లో టాప్ 20లో ముఖేష్ అంబానీ, ఆదానీ గ్రూప్ సంస్థల ఛైర్మన్ గౌతమ్ ఆదానీలు స్థానాలు పొందారు. టాప్ 100లో తొమ్మిది మంది భారతీయ వ్యాపార దిగ్గజాలు నిలిచి సత్తా చాటారు.
ప్రతి ఏటా బ్లూమ్‌బర్గ్ ప్రపంచ కుబేరులు తో కూడిన ఈ జాబితాను విడుదల చేస్తుంది. ఈ క్రమంలో ఈ ఏడాది బ్లూమ్‌బర్గ్ బిలియనీర్స్ జాబితాను తాజాగా విడుదల చేసింది. బ్లూమ్‌బర్గ్ ఇండెక్స్ 500 అత్యంత ధనవంతుల జాబితాలో భారతదేశం నుండి 17వ స్థానంలో ముఖేష్ అంబానీ, 20వ స్థానంలో గౌతమ్ ఆదానీ, 41వ స్థానంలో శివనాడార్, షాపూర్ మిస్త్రీ (52వ స్థానం), సావిత్రి జిందాల్ (59స్థానం), అజీమ్ ప్రేమ్ జీ (69వ స్థానం), సునీల్ మిట్టల్ (73వ స్థానం), దిలీప్ సంఘ్వీ (79స్థానం), లక్ష్మీ మిట్టల్ (86వ స్థానం)లు 100 స్థానాల్లోపు ఉన్నారు.
Trending
- ఈ ప్రభుత్వం చెత్త నుంచి సంపద వచ్చేలా చూస్తుంది: ఏపీ సీఎం చంద్రబాబు
- త్యాగధనుడు, తెలుగుజాతి సాహసానికి ప్రతీక టంగుటూరికి ఏపీ సీఎం చంద్రబాబు నివాళులు
- గత 14నెలలుగా సమర్థంగా సంస్కరణలు అమలుచేశాం: మంత్రి నారా లోకేష్
- అవినీతిపై ఎన్డీయే ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించబోతోంది: ప్రధాని మోడీ
- కృష్ణా,గోదావరి నదుల్లో వరద ప్రవాహాలపై సీఎం చంద్రబాబు సమీక్ష
- ‘మన శంకరవరప్రసాద్ గారు’…’పండగకి వస్తున్నారు..’ స్టైలిష్ లుక్ లో చిరు
- ఆసియా కప్ లో ఓకే… ద్వైపాక్షిక సిరీస్ లు ఉండవు
- సెలక్షన్ కమిటీ ఛైర్మన్ గా అజిత్ అగార్కర్ పదవీకాలం పొడిగింపు