నేచురల్ స్టార్ నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్‌లో ‘దసరా’ వంటి చిత్రం వచ్చి ఘనవిజయాన్ని అందుకున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం వీరి కాంబో లో వస్తున్న మరో ప్రతిష్ఠాత్మక చిత్రం ‘ది ప్యారడైజ్’. ఈ యాక్షన్ థ్రిల్లర్ నుండి ఈ రోజు నాని ఫస్ట్ లుక్ ను మూవీ టీమ్ విడుదల చేసింది. ఇందులో నాని ‘జడల్’ అనే పవర్‌ఫుల్ పాత్రలో కనిపించనుండగా, ఆయన లుక్ ఇంతకు ముందు పాత్రల కంటే చాలా డిఫరెంట్ గా ఉంది.
ఇక ఈ సందర్భంగా డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల సోషల్ మీడియాలో పోస్టర్ ను షేర్ చేసి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. “మీ అందరి ముందుకి ‘జడల్’ను తీసుకొస్తున్నా. ఈసారి మా హీరో నాని అన్న నరకంలోకి నడిచివెళ్లి దాన్ని ‘ది ప్యారడైజ్’గా మార్చేస్తాడు” అని పేర్కొన్నారు. నాని కూడా తన లుక్‌ను షేర్ చేస్తూ, “వాడి పేరు ‘జడల్’. ఉన్నది ఉన్నట్లు చెబుతున్నా” అని పేర్కొన్నారు.
తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళం, బెంగాలీ, ఇంగ్లీష్, స్పానిష్ సహా మొత్తం 8 భాషల్లో ఈ చిత్రం 2026 మార్చి 26న ప్రపంచవ్యాప్తంగా సినిమా థియేటర్లలోకి రానుంది. ఈ చిత్రంలో ‘కిల్’ సినిమాతో గుర్తింపు పొందిన నటుడు రాఘవ్ జుయల్ ప్రతినాయకుడి పాత్రలో నటిస్తున్నారు. ఈ సినిమాలోని ప్రతి పాత్రను రెండు పోస్టర్ల ద్వారా పరిచయం చేస్తామని దర్శకుడు ఓదెల తెలిపారు. ఎస్ఎల్‌వి సినిమాస్ పతాకంపై సుధాకర్ చెరుకూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
Trending
- ఈ ప్రభుత్వం చెత్త నుంచి సంపద వచ్చేలా చూస్తుంది: ఏపీ సీఎం చంద్రబాబు
- త్యాగధనుడు, తెలుగుజాతి సాహసానికి ప్రతీక టంగుటూరికి ఏపీ సీఎం చంద్రబాబు నివాళులు
- గత 14నెలలుగా సమర్థంగా సంస్కరణలు అమలుచేశాం: మంత్రి నారా లోకేష్
- అవినీతిపై ఎన్డీయే ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించబోతోంది: ప్రధాని మోడీ
- కృష్ణా,గోదావరి నదుల్లో వరద ప్రవాహాలపై సీఎం చంద్రబాబు సమీక్ష
- ‘మన శంకరవరప్రసాద్ గారు’…’పండగకి వస్తున్నారు..’ స్టైలిష్ లుక్ లో చిరు
- ఆసియా కప్ లో ఓకే… ద్వైపాక్షిక సిరీస్ లు ఉండవు
- సెలక్షన్ కమిటీ ఛైర్మన్ గా అజిత్ అగార్కర్ పదవీకాలం పొడిగింపు