భారత కెప్టెన్ శుభ్ మాన్ గిల్ దేశవాళీ క్రికెట్లో ఆడనున్నాడు. ఈనెల 28న ప్రారంభం కానున్న దులీప్ ట్రోఫీలో పాల్గొనే నార్త్ జోన్ జట్టుకు గిల్ నాయకత్వం వహించనున్నాడు. పేసర్లు అర్ష్ దీప్ సింగ్, హర్షిత్ రాణా, అన్షుల్ కాంబోజ్ లతో కూడిన 15 మంది టీమ్ ను సెలెక్టర్లు ప్రకటించారు. ఇక యూఏఈ ఆతిథ్యమివ్వనున్న ఆసియా కప్ సెప్టెంబరు 10న ప్రారంభంకానుంది. దీంతో దులీప్ ట్రోఫీ మొత్తానికి గిల్ అందుబాటులో ఉండకపోచ్చు. సెప్టెంబరు 10న యూఏఈ, 14న పాకిస్థాన్ తో భారత్ తలపడనుంది.
ఎంపిక చేసిన టీమ్:
శుభ్ మన్ గిల్ (కెప్టెన్), అంకిత్ కుమార్ (వైస్ కెప్టెన్), శుభం కజూరియా, ఆయుష్ బదోని, యశ్ ధూల్, అంకిత్ కల్సి, నిశాంత్ సింధూ, సాహిల్ లోత్రా, మయాంక్ దాగర్, యుధ్ వీర్ సింగ్ చరక్, అర్ష్ దీప్ సింగ్, హర్షిత్ రాణా, అన్షుల్ కాంబోజ్, ఆకిబ్ నబి, కన్హయ్య (వికెట్ కీపర్).
Trending
- ఈ ప్రభుత్వం చెత్త నుంచి సంపద వచ్చేలా చూస్తుంది: ఏపీ సీఎం చంద్రబాబు
- త్యాగధనుడు, తెలుగుజాతి సాహసానికి ప్రతీక టంగుటూరికి ఏపీ సీఎం చంద్రబాబు నివాళులు
- గత 14నెలలుగా సమర్థంగా సంస్కరణలు అమలుచేశాం: మంత్రి నారా లోకేష్
- అవినీతిపై ఎన్డీయే ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించబోతోంది: ప్రధాని మోడీ
- కృష్ణా,గోదావరి నదుల్లో వరద ప్రవాహాలపై సీఎం చంద్రబాబు సమీక్ష
- ‘మన శంకరవరప్రసాద్ గారు’…’పండగకి వస్తున్నారు..’ స్టైలిష్ లుక్ లో చిరు
- ఆసియా కప్ లో ఓకే… ద్వైపాక్షిక సిరీస్ లు ఉండవు
- సెలక్షన్ కమిటీ ఛైర్మన్ గా అజిత్ అగార్కర్ పదవీకాలం పొడిగింపు