ఈరోజు 79వ భారత స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా కాకినాడ పరేడ్ గ్రౌండ్ లో నిర్వహించిన స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు.
జాతీయ పతాకం ఎగురవేసిన అనంతరం రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను, రాష్ట్ర సంస్కృతి, సాంప్రదాయాలను చాటుతూ రూపొందించిన శకటాల ప్రదర్శనను తిలకించారు. ఏపీలో అభివృద్ధి, సంక్షేమం సమంగా ముందుకు సాగుతుంది, ఇచ్చిన హామీల ప్రకారం సూపర్ పథకాలను అమలు చేస్తూ మహిళలకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నట్టు తెలిపారు. రాష్ట్రంలో తల్లికి వందనం పథకం ద్వారా ఈ ఏడాది 67.27 లక్షల మాతృ మూర్తులకు 8,745 కోట్లు వారి ఖాతాల్లో జమ చేశాం. దీపం2 పథకం కింద ఇప్పటికీ 2 విడతలుగా కోటి ఉచిత గ్యాస్ సిలిండర్లు, 5 ఏళ్ళలో ఏడాదికి 3 సిలిండర్ల చొప్పున 13,423 కోట్లు ఖర్చు చేయబోతున్నట్లు వివరించారు. ఈ రోజు నుండి స్త్రీ శక్తి పథకం ద్వారా ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం ప్రారంభిస్తున్నామన్నారు. పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన వెంటనే జాతీయ పండుగల నిధులను మైనర్ పంచాయతీలకు 100 నుండి 10,000 కి, మేజర్ పంచాయితీలకు 250 నుండి 25,000 కి పెంచిన విషయాన్ని గుర్తు చేశారు.గ్రామ స్వరాజ్య సాధన లక్ష్యంలో భాగంగా ఒకేరోజు 13,326 గ్రామ పంచాయతీల్లో గ్రామ సభలు నిర్వహించి ప్రపంచ రికార్డు సాధించామన్నారు. గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా 75.23 లక్షల ఉపాధి శ్రామికులకు గ్రామాల్లోనే ఉపాధి కల్పించి, ప్రమాద పరిహారం 50 వేల నుంచి 4 లక్షలకు పెంచాం.అడవితల్లి బాట” కింద కొండ ప్రాంతాల్లో 1,005 కోట్లతో 625 గిరిజన గ్రామాలను అనుసంధానిస్తూ 1,069 కి.మీ.ల రోడ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టాం. జల్ జీవన్ మిషన్ కింద 5 జిల్లాల్లో 5 కొత్త ప్రాజెక్టులను 7,910 కోట్లతో ప్రారంభించి 1 కోటి 20 లక్షల మందికి 30 ఏళ్ళ పాటు తాగు నీటి భద్రతను కల్పించబోతున్నామని వివరించారు.
ఏపీలో అభివృద్ధి, సంక్షేమం సమంగా ముందుకు సాగుతుంది:డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్
By admin2 Mins Read
Previous Articleమొదలైన వెంకటేష్- త్రివిక్రమ్ సినిమా..!
Next Article ఏపీలో స్త్రీ శక్తి- ఉచిత బస్సు ప్రయాణ పథకం ప్రారంభం