జగధీప్ ధన్కర్ రాజీనామాతో ఖాళీ అయిన ఉపరాష్ట్రపతి పదవికి సెప్టెంబర్ 9న ఎన్నిక జరుగనుంది. కాగా, ఈ ఉపరాష్ట్రపతి పదవికి పోటీ చేయనున్న అభ్యర్థిని ఎన్డీయే ఖరారు చేసింది. తమిళనాడుకు చెందిన C.P. రాధాకృష్ణన్ వైస్ ప్రెసిడెంట్ పదవికి నామినేషన్ వేయబోతున్నట్లు కేంద్రమంత్రి జితన్ రామ్ ప్రకటించారు. ప్రస్తుతం ఆయన మహారాష్ట్ర గవర్నర్ గా ఉన్నారు.
గతంలో రెండు సార్లు బీజేపీ తరపున పోటీ చేసి కోయంబత్తూరు ఎంపీగా ఎన్నికయ్యారు. తమిళనాడు బీజేపీ అధ్యక్షుడిగా కూడా పనిచేశారు. 2023 ఫిబ్రవరి 18 నుండి జార్ఖండ్ గవర్నర్ గా బాధ్యతలు చేపట్టారు. గతంలో తెలంగాణతో పాటు పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ గా అదనపు బాధ్యతలు నిర్వహించారు.
ఎన్డీయే ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా C.P. రాధాకృష్ణన్ పేరు ఖరారు..!
By admin1 Min Read
Previous Article‘OG’ లో కణ్మణీగా అలరించనున్న ప్రియాంక మోహన్
Next Article సత్య దేవ్ ‘రావు బహదూర్’ టీజర్… విడుదల చేసిన రాజమౌళి