యువ కథానాయకుడు విశ్వక్ సేన్- మీనాక్షి చౌదర జంటగా “మెకానిక్ రాకి” అనే చిత్రాన్ని దర్శకుడు రవితేజ ముల్లపూడి రూపొందిస్తున్నాడు.ఇందులో శ్రద్ధ శ్రీనాథ్ కీలకమైన పాత్రలో నటిస్తుంది. ఈనెల 22న విడుదల కానున్న నేపథ్యంలో చిత్ర బృందం కొత్త ట్రైలర్ ను విడుదల చేసింది.ఈ ట్రైలర్ లో ఎమోషన్స్ సన్ని వేశాలతో పాటుగా పలు డైలాగులతో కామెడీ టైమింగ్ తో ప్రేక్షకుల ఆకట్టుకునేలా చూపించారు.అయితే ఈ చిత్రం కథ మొత్తం మెకానిక్ షాప్ స్థలం కోసమే అన్నట్లుగా కనిపిస్తోంది.ఇందులో విశ్వక్ సేన్ తండ్రిగా వికే.నరేష్ నటించారు.
విశ్వక్ సేన్ మరోసారి మాస్ డైలాగులు ఆకట్టుకున్నాడు. మీనాక్షి చౌదరి , శ్రద్ధ శ్రీనాథ్, విశ్వక్సేన్ మధ్య సన్నివేశాలు కూడా బాగానే ఆకట్టుకుంటున్నాయి.ఇందులో విలన్ గా సునీల్ నటిస్తున్నాడు.ఈ చిత్రానికి జెక్స్ బెజొయ్ సంగీతం అందిస్తున్నాడు.మొత్తానికి మెకానిక్ రాఖీ సినిమాతో విశ్వక్ సక్సెస్ అందుకునేలా కనిపిస్తున్నారని అభిమానులైతే కామెంట్స్ చేస్తున్నారు.ఈ చిత్రాన్ని ఎస్ఆర్.టి ఎంటర్టైన్మెంట్ నిర్మిస్తుంది.
ఈ నెల 22న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.