ఉక్రెయిన్ – రష్యా యుద్ధం దాదాపు మూడేళ్లు పూర్తయింది.అయితే ఈ యుద్ధంలో రష్యాకు పెద్ద మొత్తంలో ఉత్తర కొరియా సైనిక సాయం అందిస్తోంది.తాజాగా మరో కీలక పరిణామం చోటుచేసుకుంది.ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ తో రష్యా సహజవనరులు, జీవావరణ మంత్రి అలెగ్జాండర్ క్లోజోవ్ భేటీ అయ్యాడు.ఈ విషయాన్ని ఉత్తరకొరియా అధికారిక వార్తా సంస్థ తెలిపింది.కాగా ఇది స్నేహపూర్వకమైన సమావేశంగా వార్తా సంస్థ వెల్లడించింది.వాణిజ్యం, ఆర్థిక, శాస్త్ర సాంకేతిక సహకారంతో పాటు పలు అంశాలపై వీరు చర్చించుకున్నారని వెల్లడించారు.మరోవైపు రష్యన్ మిలిటరీ అకాడెమీ ప్రతినిధులు కూడా ఉత్తర కొరియాలో పర్యటించినట్టు తెలుస్తుంది.
Previous Article“మెకానిక్ రాకి” ట్రైలర్ విడుదల
Next Article వరుస నష్టాల నుండి కోలుకుని లాభాల బాటలో మార్కెట్లు