‘హనుమాన్’తో స్టార్ దర్శకుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు ప్రశాంత్ వర్మ.ప్రస్తుతం ఈసినిమా సీక్వెల్ పనుల్లో ఆయన బిజీగా ఉన్నారు.‘దేవకీ నందన వాసుదేవ’ ప్రీరిలీజ్ ఈవెంట్‌లో పాల్గొన్న ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.‘‘ఇండస్ట్రీలోకి రాకముందే 33 కథలు రాసుకున్నా.ఇప్పటివరకు తీసిన సినిమాలకు,వాటికి సంబంధం లేదు.
ఇవి కొత్తవి నాకు కథలు రాయడం చాలా ఇష్టం.అవకాశమిస్తే దర్శకత్వం మానేసి వేరే దర్శకుల కోసం కథలు రాయడానికే ఎక్కువ ప్రాధాన్యమిస్తా’’ అని చెప్పారు.ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్‌గా మారాయి.అశోక్ గల్లా హీరోగా నటించిన ‘దేవకీ నందన వాసుదేవ’చిత్రానికి కథ అందించింది ప్రశాంత్ వర్మనే కావడం విశేషం.నవంబర్ 22న ఇది విడుదల కానుంది.