‘అమ్ము’తో తెలుగువారికి చేరువైన నటి ఐశ్వర్య లక్ష్మి.తాజాగా ఆమె పెళ్లిపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.జీవితంలో పెళ్లి చేసుకోవాలనే ఉద్దేశం తనకు లేదని అన్నారు.యుక్త వయసులో తనకు కూడా అందరి అమ్మాయిల మాదిరిగానే పెళ్లిపై ఎన్నో మంచి ఆలోచనలు ఉండేవని అన్నారు.పెళ్లి చేసుకుని స్థిరపడాలని ఎన్నో కలలు కన్నట్లు చెప్పారు.
‘‘జీవితంలో పెళ్లి చేసుకోవాలని లేదు.ఎంతో ఆలోచించి తీసుకున్న ఈనిర్ణయం తీసుకున్నా.నాకు తెలిసిన చాలా మంది పెళ్లి తర్వాత రాజీ పడి బతుకుతున్నారు.పెళ్లి వల్ల చాలామంది వ్యక్తిగతంగానూ ఎదగలేకపోతున్నారు.అందుకే పెళ్లి వద్దని ఫిక్సయ్యా’’ అని అన్నారు.ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు వైరల్‌గా మారాయి.