ఏఆర్ రెహమాన్ తనకు తండ్రితో సమానమని ఆయన టీమ్‌లోని సభ్యురాలు మోహినిదే తెలిపారు.రెహమాన్ విడాకులతో తనకి సంబంధం ఉందంటూ వస్తోన్న వార్తలు చూస్తుంటే తనకు బాధగా ఉందని చెప్పారు.‘రెహమాన్ కుమార్తెలది నాది ఒకే వయసు.దాంతో ఆయన నన్ను ఒక కూతురులా చూసేవారు.దాదాపు 8 ఏళ్ల నుంచి ఆయన టీమ్‌లో వర్క్ చేస్తున్నా.ఆయన నాకు రోల్ మోడల్,నాకెంతో గౌరవం ఉంది.మా గురించి ఇప్పుడు ఇలాంటి వార్తలు రావడం చాలా బాధగా ఉంది.ఇలాంటి క్లిష్ట సమయాల్లో సానుభూతిని చూపించకుండా ఇలాంటి నిందలు వేయడం ఎంతో బాధను కలిగిస్తుంది.ఎదుటి వ్యక్తుల గురించి అసభ్యకరంగా మాట్లాడడం నేరంగా పరిగణించాలి’అని తెలిపారు.ఇప్పటికైనా ఇలాంటి వార్తలకు చెక్ పెట్టాలని కోరారు.వ్యక్తిగత గోప్యతకు భంగం కలిగించవద్దని కోరారు.29 ఏళ్ల వైవాహిక బంధానికి స్వస్తి పలుకుతూ రెహమాన్ – సైరా బాను దంపతులు నవంబర్ 19న విడిపోవాలనుకుంటున్నామని ప్రకటించారు.
పరస్పర అంగీకారంతోనే ఈ నిర్ణయం తీసుకున్నామని చెప్పారు.అయితే అదే రోజు మోహిని దే కూడా తన భర్త నుంచి విడిపోతున్నానని తెలిపారు.దీంతో వీరిద్దరి విడాకులకు సంబంధం ఉందని ప్రచారం జరిగింది.ఈ క్రమంలోనే సైరా బాను ఇటీవల ఒక ఆడియో మెసేజ్ రిలీజ్ చేశారు.తన భర్త ఎంతో గొప్పవాడని అన్నారు.ఆయన గురించి ఇలాంటి వార్తలు రాయొద్దని కోరారు.అనారోగ్యం కారణంగానే తానే రెహమాన్‌కు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నానని అన్నారు.విడాకులు అధికారికం కాకుండా ఈవిధంగా మాట్లాడటం సరికాదన్నారు.

