భారత రాజ్యాంగం ఆమోదం పొంది 75 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా పాత పార్లమెంట్ ప్రాంగణంలోని సెంట్రల్ హాల్లో ప్రత్యేక వేడుకలు నిర్వహించారు. రాజ్యాంగానికి సంబంధించిన రెండు పుస్తకాలు, 75 వసంతాలకు గుర్తుగా స్మారక పోస్టల్ స్టాంప్ ను విడుదల చేశారు. దేశ ప్రథమ పౌరురాలు రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము నేతృత్వంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్కడ్, ప్రధాని మోడీ, లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా సహా లోక్ సభ, రాజ్యసభ సభ్యులందరూ పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్రపతి ప్రసంగించారు. దేశ ప్రజలందరికీ రాజ్యాంగ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. 75 ఏళ్ల క్రితం ఇదేరోజున రాజ్యాంగం ఆమోదం పొందింది. ఇది మన పవిత్ర గ్రంథమని పేర్కొన్నారు. ప్రజాస్వామ్య, గణతంత్ర సూత్రాల ఆధారంగా రాజ్యాంగ రూపకల్పన జరిగిందని వివరించారు. సమాజానికి రాజ్యాంగం మూలస్తంభం వంటిదని అన్నారు.రాజ్యాంగ రచనలో భాగస్వాములను స్మరించుకోవాలని పేర్కొన్నారు. మన రాజ్యాంగం సజీవ, ప్రగతిశీల పత్రమని దీనిని ఆధారంగా చేసుకొని సామాజిక న్యాయం, సమ్మిళిత అభివృద్ధి లక్ష్యాలను సాధించగలిగామని రాష్ట్రపతి పేర్కొన్నారు. రాజ్యాంగానికి రాజేంద్రప్రసాద్, అంబేడ్కర్ మార్గనిర్దేశం చేశారని తెలిపారు. రాజ్యాంగ నిర్మాణంలో ముఖ్య పాత్ర పోషించి 15 మంది మహిళల సేవలను ఈసందర్భంగా గుర్తుచేసుకున్నారు. మహిళా రిజర్వేషన్లపై చట్టం గురించి రాష్ట్రపతి ప్రత్యేకంగా ప్రస్తావించారు. దీని ద్వారా ప్రజాస్వామ్యంలో మహిళా సాధికారిత నూతన శకాన్ని ప్రారంభించుకున్నామని వివరించారు. ప్రసంగం అనంతరం సభ్యులందరితో కలిసి రాజ్యాంగ పీఠిక సామూహిక పఠనం చేశారు.
సమాజానికి ఇది మూలస్థంబం:రాజ్యాంగ దినోత్సవ వేడుకల్లో రాష్ట్రపతి
By admin1 Min Read
Previous Articleనన్ను సెకండ్ హ్యాండ్ అన్నారు: సమంత
Next Article రెహమాన్ నాకు తండ్రితో సమానం: మోహినిదే వివరణ