అక్కినేని ఇంట మరో పెళ్లి సందడి మొదలైంది. సైలెంట్ గా అఖిల్ ఎంగేజ్మెంట్ అక్కినేని ఇంత వరుసగా వివాహాలు జరగనున్నాయి.మరో వారం రోజులో నాగ చైతన్య పెళ్లి జరగనున్న విషయం తెలిసింది.తాజాగా అఖిల్ కూడా పెళ్లికి సిద్ధమయ్యారు.ఇప్పటివరకు ది మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ గా ఉన్న అతను త్వరలోనే వైవాహిక బంధంలోకి అడుగుపెట్టనున్నారు.జైనాబ్ రవడ్జీ అనే అమ్మాయితో అఖిల్ ఎంగేజ్ మెంట్ జరిగింది.హైదరాబాద్‌లోని నాగార్జున ఇంట్లో కుటుంబ సభ్యుల సమక్షంలో ఈ వేడుక జరిగింది.అక్కినేని అఖిల్ నిశ్చితార్థం విషయాన్ని నాగార్జునే స్వయంగా సోషల్ మీడియా ద్వారా అధికారికంగా ప్రకటించాడు.కాబోయే జంట ఫొటోలను కూడా అందులో షేర్ చేశాడు.
దీంతో అఖిల్ అక్కినేని ఎంగేజ్ మెంట్ ఫొటోలు ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరలవుతున్నాయి. పలువురు సినీ ప్రముఖులు, అభిమానులు, నెటిజన్లు కాబోయే జంటకు అభినందనలు, శుభాకాంక్షలు తెలుపుతున్నారు.జైనబ్‌తో మా తనయుడు అఖిల్ నిశ్చితార్థం జరిగిందని తెలియజేస్తున్నందుకు ఆనందిస్తున్నాం.కోడలిగా జైనబ్‌ను మా కుటుంబంలోకి ఆహ్వానిస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది.కాబోయే దంపతులకు మీ అందరి దీవెనలు, ఆశీస్సులు కావాలి’ అని నాగార్జున పోస్ట్ పెట్టారు.