నటి కీర్తి సురేశ తన పెళ్లికి సంబంధించి వస్తున్న వార్తలకు స్పష్టతనిచ్చారు. స్నేహితుడు ఆంటోనీని పెళ్లి చేసుకోబోతున్నట్టు అధికారికంగా ప్రకటించారు. ఈమేరకు ఒక ఫొటోను సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు. తమ 15 సంవత్సరాల బంధం ఇక జీవితాంతం కొనసాగుతుందని తెలిపారు. ఆమె అభిమానులు, పలువురు ప్రముఖులు ఈ పోస్ట్ కు స్పందిస్తూ శుభాకాంక్షలు తెలుపుతున్నారు.
ఇక ఆంటోనీ ఇంజినీరింగ్ పూర్తిచేసిన కొంతకాలం పాటు విదేశాల్లో ఉద్యోగం చేశాడు. కేరళలో అతడికి పలు వ్యాపారాలు ఉన్నాయని, ప్రస్తుతం వాటిని చూసుకుంటున్నట్టు తెలిస్తోంది.
15 years and counting ♾️🧿
It has always been..
AntoNY x KEerthy ( Iykyk) 😁❤️ pic.twitter.com/eFDFUU4APz— Keerthy Suresh (@KeerthyOfficial) November 27, 2024