మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కథానాయకుడిగా, విభిన్న చిత్రాల దర్శకుడు శంకర్ తెరకెక్కిస్తున్న చిత్రం
“గేమ్ ఛేంజర్”.ఇందులో కియారా అద్వానీ కథానాయికగా నటిస్తుంది.భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా చిత్రంగా విడుదల కానుంది.తాజాగా ఈ ఈ చిత్రం నుండి మూడో పాట విడుదల అయింది. నానా హైరానా.. ప్రియమైన హైరానా..’ అంటూ సాగే ఈ మెలోడీ కి రామజోగయ్య శాస్త్రి లిరిక్స్ రాశారు.తమన్ సంగీత దర్శకత్వంలో శ్రేయ గోషాల్, కార్తీక్ పాడారు.
శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.శ్రీకాంత్,అంజలి,సునీల్, ఎస్ జె సూర్య ముఖ్య పాత్రల్లో నటించారు.సంక్రాంతి కానుకగా జనవరి 10న ఈ సినిమా విడుదల కానుంది.ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి.ఇప్పటికే విడుదలైన అయిన రెండు పాటలు మంచి వ్యూస్ అందుకున్నాయి.తాజా విడుదలైన అయిన పాట యువతను మెప్పించేలా ఉంది.ఈ పాట కోసం దాదాపు 10 కోట్ల వరకు ఖర్చు చేశారని సమాచారం.