బాలీవుడ్ నటి మలైకా అరోరా కొత్త బిజినెస్ లోకి అడుగుపెట్టారు.ఆమె కుమారుడు అర్హాన్ ఖాన్ కలిసి ఓ రెస్టారంట్ స్టార్ట్ చేశారు.90 ఏళ్ల నాటి ఇండో పోర్చుగీస్ బంగ్లాను రెస్టారెంట్ గా సిద్ధం చేయించారు.దానికి స్కార్లెట్ హౌస్ పేరు పెట్టారు. ముంబైలో కాస్ట్లీ ప్రాంతంగా భావించే బంద్రాలోఇది ఉంది.వచ్చే నెల 3వ తేదీన ఇది ప్రారంభం కానుంది.మలైకా కలల ప్రాజెక్టు కావడంతో ఆమె దగ్గర ఉండి పనులు చేయిస్తుంది.
ఫుడ్ బిజినెస్ లోకి రావడం పై గతంలో ఆమె స్పందించారు.తనకు ఫుడ్ అంటే ఎంతో ఇష్టం అన్నారు.అలాగే తన కుమారుడికి కూడా ఫుడ్ మీద చాలా ఇష్టం ఉందన్నారు. ‘ మేమిద్దరం ఎక్కువగా ఫుడ్ గురించి మాట్లాడుకుంటాం.అందుకే మేము హోటల్ బిజినెస్ మొదలు పెట్టలనుకుంటున్నాం. అని తెలిపారు.