తెలుగు హాస్య నటుడు వెన్నెల కిషోర్ డిటెక్టివ్ పాత్రలో రూపొందుతున్న చిత్రం ‘శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్’.తాజాగా ఈ చిత్రం టీజర్‌ను చిత్రబృందం విడుదల చేసింది.ఈ చిత్రానికి రైటర్ మోహన్ దర్శకత్వం వహిస్తున్నారు.ఇందులో నాగళ్ల కథానాయికగా నటిస్తున్నారు.
ఈ చిత్రం శ్రీకాకుళంలో జరిగిన ఓ హత్య కేసులో పోలీసులకు కూడా అంతుచిక్కని రహస్యాల్ని ఓ లోకల్ గూఢచారి ఎలా ఛేదించాడనే కథాంశంతో తెరకెక్కించారు.టీజర్‌లో వెన్నెల కిశోర్ తనదైన కామెడీ, డైలాగ్ డెలివరీ టైమింగ్‌తో ఆకట్టుకున్నారు.ఈ చిత్రానికి సునీల్ కశ్యప్ సంగీతం అందిస్తున్నారు.శ్రీ గణపతి సినిమాస్ పతాకంపై వి.రమణరెడ్డి నిర్మిస్తున్నారు. ఈ చిత్రం డిసెంబర్ 25న విడుదల కానుంది.