అమెరికాకు కాబోయే కొత్త అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రస్తుతం ఏమాత్రం సేఫ్ గా లేరని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ సంచలన వ్యాఖ్యలు చేశారు.ఇటీవల అమెరికాలో ఎన్నికల ప్రచారంలో పలుమార్లు డోనాల్డ్ ట్రంప్ పై హత్యాయత్నం జరగడం,మరోసారి ట్రంప్ సభకు ఓ అనుమానితుడు ఆయుధాలతో హాజరుకావడం తదితర సంఘటనలపై పుతిన్ మాట్లాడారు.అధ్యక్ష అభ్యర్థిపై హత్యాయత్నం అసాధారణమేమీ కాకున్నా వెంటవెంటనే జరగడం మాత్రం అసాధారణమైన విషయం కాదు అని ఆయన అభిప్రాయపడ్డారు.
నా అంచనా ప్రకారం ప్రస్తుతం ట్రంప్ డేంజర్ లోనే ఉన్నాడని వెల్లడించారు.అయితే ట్రంప్ చాలా తెలివైన వ్యక్తి, నాయకుడు అని ప్రశంసలు గుప్పించారు.తనకు పొంచి ఉన్న ముప్పును అర్థం చేసుకుని ట్రంప్ జాగ్రత్తగా ఉంటారని భావిస్తున్నట్లు తెలిపారు.ఈమేరకు కజకిస్థాన్‌లో జరిగిన ఓ సదస్సులో పాల్గొన్న పుతిన్..ఆ తర్వాత మీడియాతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.