నట సింహం నందమూరి బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞ తెలుగు చలన చిత్ర పరిశ్రమలో గ్రాండ్ ఇవనున్న సంగతి తెలిసిందే.దర్శకుడు ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో మోక్షజ్ఞ ఓ చిత్రం చేయనున్నాడు. ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదలైంది.తాజాగా మోక్షజ్ఞ కొత్త లుక్ కు సంబంధించిన మరో ఫొటోను సోషల్ మీడియా ద్వారా షేర్ ప్రశాంత వర్మ చేశారు. ‘యాక్షన్ కోసం సిద్ధమా?’ అని ప్రశాంత్ వర్మ తన పోస్టులో పేర్కొన్నారు. ‘సింబా ఈజ్ కమింగ్’ అనే హ్యాష్ ట్యాగ్ ను జత చేశారు.దీనికి “నందమూరి నాయక” సాంగ్ ను జత చేసి మరీ పోస్ట్ చేశారు.
మోక్షజ్ఞ కొత్త లుక్ నందమూరి ఫ్యాన్స్ ను బాగా ఆకట్టుకుంది.తాజాగా ఈ ఫోటో సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది.ఈ చిత్రాన్ని లెజెండ్ ప్రొడక్షన్స్ తో కలిసి ఎస్ఎల్వీ సినిమాస్ పతాకంపై చెరుకూరి సుధాకర్ నిర్మిస్తున్నారు.బాలకృష్ణ చిన్న కుమార్తె తేజస్విని ఈ చిత్రాన్ని సమర్పిస్తున్నారు.త్వరలోనే ఈ చిత్రం షూటింగ్ పట్టాలెక్కనుంది.