ఇటీవల విడుదలైన ‘క’ సినిమా తో భారీ విజయాన్ని అందుకున్నారు నటుడు కిరణ్ ఆబ్బవరం. థియేటర్ లో రూ.50 కోట్లు వసూలు చేసిన ఈ సినిమా ఇప్పుడు ఈటీవీ విన్ ఓటీటీ లో స్ట్రీమింగ్ అవుతోంది. అక్కడ కూడా మంచి విజయాన్ని అందుకుంది. తాజాగా ఈ సినిమా ప్రెస్ మీట్ జరిగింది. ఈ సినిమా పై ప్రేక్షకులు చూపించిన ప్రేమకు కిరణ్ కృతజ్ఞతలు చెప్పారు. క 2 భారీ స్థాయిలో ఉంటుందన్నారు. క అనుకున్నంత విజయం అందుకోకపోతే సినిమాలు మానేస్తా అన్నారు నిజంగానే అదే చేస్తారా? అని విలేకరి ప్రశ్నించగా.. ఆవును ఇక్కడ నుంచి వెళ్ళిపోయేవాడిని అన్నారు. తాను మాటపై నిలబడతా అన్నారు.మంచి సినిమా చేస్తే ప్రేక్షకుల ప్రేమను గెల్చుకోవచ్చు అనే ధైర్యాన్ని, నమ్మకాన్ని “క“ సినిమా ఇచ్చిందని తెలిపారు.
Trending
- ఈ ప్రభుత్వం చెత్త నుంచి సంపద వచ్చేలా చూస్తుంది: ఏపీ సీఎం చంద్రబాబు
- త్యాగధనుడు, తెలుగుజాతి సాహసానికి ప్రతీక టంగుటూరికి ఏపీ సీఎం చంద్రబాబు నివాళులు
- గత 14నెలలుగా సమర్థంగా సంస్కరణలు అమలుచేశాం: మంత్రి నారా లోకేష్
- అవినీతిపై ఎన్డీయే ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించబోతోంది: ప్రధాని మోడీ
- కృష్ణా,గోదావరి నదుల్లో వరద ప్రవాహాలపై సీఎం చంద్రబాబు సమీక్ష
- ‘మన శంకరవరప్రసాద్ గారు’…’పండగకి వస్తున్నారు..’ స్టైలిష్ లుక్ లో చిరు
- ఆసియా కప్ లో ఓకే… ద్వైపాక్షిక సిరీస్ లు ఉండవు
- సెలక్షన్ కమిటీ ఛైర్మన్ గా అజిత్ అగార్కర్ పదవీకాలం పొడిగింపు