ఏపీ డిప్యూటీ సీఎం పవన్ ఆలోచనల ఫలితంగా గిరిజనుల జీవనశైలి మార్చేందుకు, వారికి సుస్థిరమైన ఆర్థిక ప్రగతి చూపించే దిశగా ఆంధ్రప్రదేశ్ అటవీశాఖ సరికొత్త ప్రణాళికతో ముందుకు వెళ్తోంది. దీనిలో భాగంగా ఆంధ్రప్రదేశ్ అటవీశాఖ, ఆంధ్రప్రదేశ్ అటవీ అభివృద్ది సంస్థ, ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ (ఐ.ఎస్.బి.) ఆధ్వర్యంలోని భర్తీ ఇనిస్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ పాలసీ సంస్థలు అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నాయి.
ఈ ఒప్పందం ప్రకారం – అడవుల్లో దొరికే సహజ సిద్ధమైన సీజనల్ ఉత్పత్తుల గుర్తింపు, సేకరణ, మార్కెటింగ్ మీద ప్రధానంగా దృష్టి సారిస్తారు. ప్రాజెక్టులో ఆయా ప్రాంతాల్లోని స్థానిక గిరిజనులను భాగస్వామ్యం చేసి ముందుకు వెళ్తారు. ముఖ్యంగా గిరిజన మహిళలను దీనిలో భాగం చేసి వారిని ఆర్థికంగా బలోపేతం చేస్తారు. కలప ఉత్పత్తులను మినహాయించి ఇతర నాణ్యమైన, అరుదైన అటవీ ఉత్పత్తులకు అదనపు విలువ జోడించి మార్కెటింగ్, బ్రాండింగ్ చేయడం మీద దృష్టిపెడతారని ఏపీ డిప్యూటీ సీఎం కార్యాలయం ‘ఎక్స్’ లో పోస్ట్ చేసింది.
అడవి బిడ్డల సుస్థిర ఆర్థిక వృద్ధికి ఆంధ్రప్రదేశ్ అటవీ శాఖ ప్రత్యేక ప్రణాళిక!
By admin1 Min Read