అగ్ర నటుడు అమితాబ్ బచ్చన్ హోస్ట్ గా చేస్తున్న రియాల్టీ షో కౌన్ బనేగా కరోడ్ పతి. దీనిని ఉద్దేశించి తాజాగా
అలనాటి నటి రేఖ ఆసక్తి కర కామెంట్స్ చేశారు. తాను ఈ షో చూస్తుంటానని చెప్పారు. బిగ్ బి ప్రతి డైలాగ్ తనకి గుర్తు ఉందని కపిల్ శర్మ షో లో చెప్పారు.అమితాబ్ షో గురించి రేఖ చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం బి టౌన్ లో వైరల్ అయ్యాయి. కెరీర్ ఆరంభంలో రేఖ – అమితాబ్ ప్రేమించుకున్నారని గతంలో చాలాసార్లు వార్తలు వచ్చాయి.వీరిద్దరూ పెళ్లి చూసుకుందాం అనుకున్నారని టాక్.ఈ వార్తలపై అధికారికంగా వీళ్ళు ఎప్పుడూ మాట్లాడలేదు.అమితాబ్ అంటే తనకు చాలా ఇష్టం అని రేఖ చాలాసార్లు చెప్పారు.’నేను నటిగా ఈ స్థాయిలో ఉన్నానంటే దానికి పూర్తి కారణం అమితాబ్.ఆయన నుంచే నేను ఎన్నో విషయాలు నేర్చుకున్నా.ఆయన చాలా గొప్ప వ్యక్తి ‘ అని రేఖ గతంలో చెప్పారు.
Previous Articleఅండర్-19 ఆసియా కప్: భారత్ భారీ విజయం
Next Article జైలుకు వెళ్తే సినిమా కథలు రాసుకుంటా: రాంగోపాల్ వర్మ