ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తాజాగా ప్రెస్ మీట్ నిర్వహించారు.ఏపీ లో తనపై నమోదు అయిన కేసు గురించి మాట్లాడారు.తాను ఎక్కడికి పారిపోలేదన్నారు.కొన్ని మీడియా తన గురించి తప్పుడు కథనాలు ప్రచురిస్తున్నాయన్నారు. ‘ పోలీసులు నన్ను పట్టుకోవడం గురించి చాలా మంది మాట్లాడుతున్నారు.నన్ను అరెస్టు చేస్తే జైలు లో కూర్చొని నాలుగు కథలు రాసుకుoటా.నేను ఎప్పుడో పెట్టిన పోస్టులకు ఏడాది తర్వాత ఎవరో స్పందించడం ఏంటి? నా అరెస్టు గురించి ఏ అధికారి చెప్పలేదు కదా? అలాంటప్పుడు నాపై ఎలా అలాంటి కథనాలు రాస్తారు? ప్రకాష్ రాజ్,నాగార్జున నన్ను దాచి పెట్టారని వార్తలు రాస్తున్నారు.నా గురించి కార్టూన్స్ వేస్తున్నారని వర్మ తెలిపారు.
Previous Articleఅమితాబ్ షో నేను చూస్తా : రేఖ
Next Article పవన్ కళ్యాణ్ కు అల్లు అర్జున్ థాంక్స్…!