ప్రముఖ నటులు నాగచైతన్య-శోబితాల వివాహం వేడుకగా జరిగింది. వీరి వివాహానికి సంబంధించిన ఫోటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. అభిమానులు, ప్రేక్షకులు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. సినిమా పరిశ్రమ నుండి అతిరథమహారధులు ఈ వేడుకలో పాల్గొన్నారు. చిరంజీవి, రామ్ చరణ్, వెంకటేష్, అల్లు అర్జున్, ఎన్టీఆర్ సహా పలువురు ప్రముఖులు కొత్త జంటకు తమ శుభాకాంక్షలు, ఆశీస్సులు అందించారు. నాగార్జున తన ఆనందాన్ని పెళ్లి ఫోటోలను సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు.
నా ప్రియమైన చైతన్యకి శుభాకాంక్షలు. ఈ అందమైన అధ్యాయాన్ని మరియు శోభిత చై కలిసి ప్రారంభించడం నాకు ఒక ప్రత్యేకమైన, భావోద్వేగ క్షణంగా నిలిచింది. మా కుటుంబానికి స్వాగతం, ప్రియమైన శోభిత. మీరు ఇప్పటికే మా జీవితాలలో ఎంతో ఆనందాన్ని తీసుకువచ్చారు. ఏఎన్నార్ గారి శతజయంతి సంవత్సరాన్ని పురస్కరించుకొని ఏర్పాటు చేసిన వారి విగ్రహం వద్ద వారి ఆశీర్వాదంతో ఈవేడుక జరగడం ఈ సంబరానికి మరింత ప్రత్యేకతని తీసుకొచ్చింది. ఈ ప్రయాణంలో ప్రతి అడుగులోనూ వారి ప్రేమ మరియు మార్గదర్శకత్వం ఉన్నట్లు అనిపిస్తోందని పేర్కొన్నారు.
Previous Articleపుష్ప-2 పై నాగబాబు సంచలన పోస్ట్…!
Next Article సంధ్య థియేటర్ వద్ద అపశ్రుతి…!