సాయి దుర్గ తేజ్ కథానాయకుడిగా,కొత్త దర్శకుడు రోహిత్ దర్శకత్వంలో #SDT18 అనే చిత్రం తెరకెక్కుతుంది.సాయి తేజ్ కు జోడిగా ఐశ్వర్య లక్ష్మి కథానాయికగా నటిస్తుంది.అయితే చిత్రాన్ని ‘హనుమాన్’ నిర్మాతలు కె నిరంజన్ రెడ్డి, చైతన్య రెడ్డి ప్రైమ్‌షో ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు.తాజాగా చిత్రబృందం అప్డేట్ ఇచ్చింది.
ఇందులో కీలక పాత్రలలో నటిస్తున్న జగపతి బాబు, సాయి కుమార్ ల పోస్టర్లను ఇప్పటికే చిత్రబృందం విడుదల చేసింది.తాజాగా ఈ సినిమాకి సంబంధించిన కీలక పోస్టర్ ను విడుదల చేశారు.ఈ పోస్టర్ లో కేవలం సాయి ధరమ్ తేజ్ చేతిని, రక్తంతో తడిసిన ఖడ్గాన్ని చూపించారు.అయితే డిసెంబర్ 12న మరో కీలక అప్డేట్ ఇవ్వనున్నట్లు తెలిపింది.ఈ చిత్రానికి బి. అజనీష్ లోక్‌నాథ్ సంగీతం అందిస్తున్నాడు.ఈ చిత్రాన్ని తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో విడుదల చేయనున్నారు.
See you on Dec 12th 😊#SDT18Carnage pic.twitter.com/5Dnu8mzTIg
— Sai Dharam Tej (@IamSaiDharamTej) December 6, 2024