తెలంగాణలో త్వరలో కాంగ్రెస్ ప్రభుత్వం ఆవిష్కరించనున్న తెలంగాణ తల్లి రూపం మార్పు చర్చనీయాంశంగా మారిన విషయం తెలిసిందే.దీనిపై బీఆర్ఎస్ అధినేత, మాజీ సిఎం కేసీఆర్ మొదటిసారిగా స్పందించారు.ఈరోజు ఎర్రవల్లి ఫాంహౌస్ లో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు,ఎమ్మెల్సీలతో భేటి అయిన కేసీఆర్ తెలంగాణ తల్లి విగ్రహం అంశంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.ఈ మేరకు ఆయన మాట్లాడుతూ…తెలంగాణ తల్లి విగ్రహం రూపం మార్పు అవివేకంతో కూడిన చర్య అని అన్నారు.ప్రజా సమస్యలు పట్టించుకోవాల్సిన ప్రభుత్వం…మూర్ఖత్వంతో ఇలా విగ్రహం మార్పులు చేసుకుంటూ పోతే ఎలా? అని కేసీఆర్ విమర్శించారు.
తెలంగాణ తల్లి విగ్రహం మార్పు అవివేకంతో కూడిన చర్య:- తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్
By admin1 Min Read