వైవిధ్యమైన కధాంశాలున్న చిత్రాలతో విభిన్నమైన పాత్రల్లో ప్రేక్షకులను అలరించడంలో అల్లరి నరేష్ ముందుంటారు. ప్రస్తుతం ఆయన కథానాయకుడిగా నటిస్తోన్న చిత్రం ‘బచ్చల మల్లి’. అమృత అయ్యర్ కథానాయికగా నటిస్తున్నారు. సుబ్బు మంగదేవి దర్శకత్వం వహిస్తున్నారు. హాస్య మూవీస్ పతాకంపై రాజేశ్ దండా, బాలాజీ గుత్తా సంయుక్తంగా నిర్మిస్తున్నారు. డిసెంబర్ 20న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. కాగా, తాజాగా ఈ చిత్ర ట్రైలర్ విడుదలైంది.నేచురల్ స్టార్ నాని ఈ చిత్రం ట్రైలర్ ను విడుదల చేశారు. ఈసందర్భంగా చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలిపారు. 1990 నేపథ్యంలో సాగే ఈ కథలో నరేశ్ అద్భుతమైన నటనతో ఆకట్టుకున్నట్లు ట్రైలర్ చూస్తుంటే తెలుస్తోంది.
Previous Articleరైతుల మార్చ్ నేపథ్యంలో శంభు సరిహద్దులో ఉద్రిక్తత
Next Article ప్రపంచాన్ని కలవరపెడుతున్న ‘డిసీజ్ ఎక్స్’

