డిసీజ్ ఎక్స్ అనే కొత్త వ్యాధి ప్రపంచవ్యాప్తంగా వ్యాప్తి చెందుతోంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం, ఇటీవల ఆఫ్రికా దేశమైన డెమొక్రాటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగోలో ఈ వ్యాధి వలన వందల మంది మరణించారు. ప్రస్తుతం డిసీజ్ ఎక్స్ వ్యాధి సోకిన రోగుల్లో జ్వరం, తలనొప్పి, దగ్గు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, రక్తహీనత, తీవ్రమైన ఫ్లూ వంటి లక్షణాలు కనిపిస్తున్నాయి. ఇది శ్వాసకోశ వ్యాధులకు సంబంధించినది కావచ్చని భావిస్తున్నారు. కాంగో ప్రావిన్స్ లోని జీ హెల్త్ జోన్ లో అక్టోబర్ 24న ఈ వ్యాధి మొదటి సారిగా నమోదైంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ డిసీజ్ ఎక్స్ ను ఎబోలా, జికా వైరస్ల జాబితాలో చేర్చింది. డిసీజ్ X” అనే పదం గ్లోబల్ ఎపిడెమిక్ లేదా పాండమిక్‌కు కారణమయ్యే అవకాశం ఉన్న ఊహాజనిత, తెలియని వ్యాధికారకాన్ని సూచిస్తుంది.
Previous Articleవిడుదలైన ‘బచ్చల మల్లి’ ట్రైలర్
Next Article అల్లు అర్జున్ కు సిఎం ఫోన్