మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ ,అగ్ర దర్శకుడు శంకర్ కలయికలో తెరకెక్కుతున్న భారీ చిత్రం ‘గేమ్ చేంజర్’.ఈ చిత్రాన్ని దిల్ రాజు నిర్మిస్తున్నారు.ఈ చిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్ ను అమెరికాలో గ్రాండ్ గా నిర్వహించడానికి చిత్రబృందం సన్నాహాలు చేస్తోందని తెలుస్తుంది.ఓ భారతీయ చిత్రం అమెరికాలో ప్రీ రిలీజ్ వేడుకను జరుపుకోనుండడం గేమ్ చేంజర్ తోనే మొదలు అని తెలుస్తుంది.ఈ మేరకు నిర్మాత దిల్ రాజు ఓ వీడియో విడుదల చేశారు.డిసెంబరు 21న గేమ్ చేంజర్ ప్రీ రిలీజ్ కార్యక్రమాన్ని అమెరికాలోని డాలస్ నగరంలో నిర్వహిస్తున్నట్టు వెల్లడించారు.సాయంత్రం 6 గంటల నుండి ఈ భారీ ఈవెంట్ జరుగుతుందని తెలిపారు.
భారతదేశ సినీ చరిత్రలో అమెరికాలో ప్రీ రిలీజ్ కార్యక్రమం జరుపుకుంటున్న మొట్టమొదటి చిత్రం తమదేనని చెప్పారు.ఈ కార్యక్రమానికి రామ్ చరణ్, హీరోయిన్ కియారా అద్వానీ, దర్శకుడు శంకర్, ఎస్.జె.సూర్య, అంజలి, సంగీత దర్శకుడు తమన్ తో కలిసి తాను కూడా హాజరవుతున్నట్టు దిల్ రాజు వివరించారు.అందరం డాలస్ లో కలుసుకుందాం అంటూ ఫ్యాన్స్ ను ఉత్సాహపరిచారు.”గేమ్ చేంజర్” ప్రీ రిలీజ్ ఫంక్షన్ ను రాజేష్ కల్లేపల్లి ఆధ్వర్యంలో చరిష్మా ఎంటర్టయిన్ మెంట్ సంస్థ నిర్వహిస్తోంది.డాలస్ లోని కర్టిస్ కల్వెల్ సెంటర్ ఈ వేడుకకు వేదిక కానుంది.
Get ready for a Sensational Evening like never before! 🔥
The most iconic celebration for #GameChanger is set to dazzle✨ the USA.
📍 Curtis Culwell Center, 4999 Naaman Forest Garland TX 75040
🗓️ 21st DEC, 6:00 PM ONWARDSEvent By : @CharismaEntmt#GamechangerOnJAN10 🚁… pic.twitter.com/rjqZy6cdVJ
— Sri Venkateswara Creations (@SVC_official) December 15, 2024