సంధ్య థియేటర్ ఘటనలో తీవ్రంగా గాయపడిన శ్రీ తేజ అనే బాలుడు గురించి అల్లు అర్జున్ తాజాగా సోషల్ మీడియా లో పోస్ట్ పెట్టారు.ఆతడు త్వరగా కోలుకోవాలని కోరుకున్నారు.శ్రీ తేజ త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నా…ప్రస్తుతం అతడిని కలవలేక పోతున్నా…త్వరలో ఆ కుటుంబాన్ని కలుస్తాను.ఆ కుటుంబానికి సాయం చేస్తాను…ఇచ్చిన మాట పై నిలబడతానని పేర్కొన్నారు.పుష్ప 2 బెనిఫిట్ షో కోసం అల్లు అర్జున్ ఈ నెల నాలుగవ తేదీన సంధ్య థియేటర్ కు వెళ్లిన విషయం తెలిసిందే.ఆయన్ని చూసేందుకు అభిమానులు పోటీ పడ్డారు.ఆ సమయంలో తొక్కిసలాట జరిగింది.ఇందులో రేవతి అనే మహిళ కన్నుమూశారు.ఆమె తనయుడు శ్రీ తేజ తీవ్రంగా గాయపడ్డాడు.ప్రస్తుతం ఆతడు హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు.ఈ విషయంలో ఇటీవల అల్లు అర్జున్ అరెస్టు ఆయ్యారు.బెయిల్ పై ఆయన బయటకు వచ్చారు.
Previous Articleబిగ్ బాస్ 8 విజేతగా నిఖిల్
Next Article ఇజ్రాయెల్ ప్రధానికి అమెరికా నూతన అధ్యక్షుడు ఫోన్