నటుడు నాగచైతన్య, నటి శోభితా ధూళిపాళ్ల ఇటీవల వివాహ బంధంలోకి అడుగుపెట్టిన విషయం తెలిసిందే.తాజాగా వీరిద్దరూ ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు.తమ ప్రేమ బంధం ఎలా మొదలైంది? పెళ్లి ప్రపోజల్ వంటి విషయాలను ఈ జంట పంచుకుంది.నాగచైతన్యను తొలిసారి తాను ఒక కేఫ్‌లో చూశానని శోభిత చెప్పారు.2022 నుంచి తమ మధ్య స్నేహం మొదలైందని అన్నారు.‘‘మా పరిచయం చాలా గమ్మత్తుగా జరిగింది.అప్పుడు చైతన్య హైదరాబాద్,నేను ముంబయిలో ఉండేవాళ్లం.నాకోసం హైదరాబాద్ నుంచి ముంబయి వచ్చేవారు.మొదటిసారి మేం బయటకు వెళ్లినప్పుడు నేను రెడ్ డ్రెస్, చైతన్య బ్లూ సూట్‌లో ఉన్నాడు.ఆ తర్వాత కర్ణాటకలోని ఓ పార్క్‌కు వెళ్లాం.అక్కడ కొంత సమయం గడిపాం. ఒకరికొకరం గోరింటాకు పెట్టుకున్నాం. ఆ తర్వాత అమెజాన్ ప్రైమ్ ఈవెంట్‌కు వెళ్లాం. అప్పటినుంచి జరిగినదంతా అందరికీ తెలిసిన విషయమే’’ అని శోభిత చెప్పారు. నాగచైతన్య కుటుంబంతో తాను ఒకసారి నూతన సంవత్సర వేడుకల కోసం గోవా వెళ్లాలని శోభిత తెలిపారు.ఆ తర్వాత తామిద్దరం పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నామని అన్నారు.ఒకరినొకరు అర్థం చేసుకున్న తర్వాత ఈ ఏడాది గోవాలో పెళ్లి ప్రతిపాదన తీసుకొచ్చినట్లు ఈ జంట తెలిపింది.
Trending
- ఈ ప్రభుత్వం చెత్త నుంచి సంపద వచ్చేలా చూస్తుంది: ఏపీ సీఎం చంద్రబాబు
- త్యాగధనుడు, తెలుగుజాతి సాహసానికి ప్రతీక టంగుటూరికి ఏపీ సీఎం చంద్రబాబు నివాళులు
- గత 14నెలలుగా సమర్థంగా సంస్కరణలు అమలుచేశాం: మంత్రి నారా లోకేష్
- అవినీతిపై ఎన్డీయే ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించబోతోంది: ప్రధాని మోడీ
- కృష్ణా,గోదావరి నదుల్లో వరద ప్రవాహాలపై సీఎం చంద్రబాబు సమీక్ష
- ‘మన శంకరవరప్రసాద్ గారు’…’పండగకి వస్తున్నారు..’ స్టైలిష్ లుక్ లో చిరు
- ఆసియా కప్ లో ఓకే… ద్వైపాక్షిక సిరీస్ లు ఉండవు
- సెలక్షన్ కమిటీ ఛైర్మన్ గా అజిత్ అగార్కర్ పదవీకాలం పొడిగింపు