పర్యావరణ పరిరక్షణ కోసం ఎంతగానో కృషి చేసి పద్మశ్రీ పురస్కారాన్ని అందుకున్న తులసీ గౌడ తుదిశ్వాస విడిచారు. ఆమె వయసు 80 సంవత్సరాలు. ఆమెను కర్ణాటక వృక్ష మాతగా పిలుస్తారు. పశ్చిమ కనుమలు, కార్ వారా, అంకోలా పరిసర ప్రాంతాల్లో 30 వేలకు పైగా మొక్కలు నాటడమే కాక ఆయా ప్రాంతాల్లో ప్రజలు, స్థానికులతో పది లక్షల మొక్కలు నాటించి పర్యావరణంపై తనకున్న మక్కువను చాటి చెప్పారు. ఆమె సేవలకు గుర్తింపుగా 2021 లో అప్పటి భారత రాష్ట్రపతి రామ్ నాధ్ కోవింద్ పద్మశ్రీ అవార్డు అందించారు. విభిన్న జాతుల మొక్కలు & మూలికలపై ఆమెకు ఉన్న అపారమైన పరిజ్ఞానం కారణంగా ‘ఎన్‌సైక్లోపీడియా ఆఫ్ ఫారెస్ట్ అని ఆమెను పిలుస్తారు. వయస్సు మీద పడిన కూడా పర్యావరణ పరిరక్షణ సందేశాన్ని ముందుకు తీసుకువెళుతూ, మొక్కల పెంపకం మీద కొత్త తరానికి తన జ్ఞానాన్ని పంచుకోవడం వంటి చర్యలతో ఎందరికో స్ఫూర్తిగా నిలిచారు.
పర్యావరణ పరిరక్షణకు ఎనలేని సేవలందించిన పద్మశ్రీ పురస్కార గ్రహీత తులసీ గౌడ కన్నుమూత
By admin1 Min Read
Previous Articleభారత్-శ్రీలంక సంబంధాలు మరింత బలపడతాయి: ప్రధాని మోడీ
Next Article మా ప్రేమ బంధం అలా మొదలైంది:నాగ చైతన్య – శోభిత