అడివిశేష్ ప్రధాన పాత్రలో నటిస్తోన్న చిత్రం ‘డకాయిట్’.ఈ చిత్రానికి షానీల్ డియో దర్శకత్వం వహిస్తున్నారు.విభిన్న ప్రేమకథా చిత్రంగా ఇది రూపుదిద్దుకుంటోంది.ప్రస్తుతం ఇది చిత్రీకరణ దశలో ఉంది.తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ఒక ఆసక్తికర అప్‌డేట్‌ను చిత్రబృందం పంచుకుంది.ఇందులో కథానాయికగా మృణాల్ ఠాకూర్ నటిస్తుంది.ఈ మేరకు నిన్న ఫస్ట్‌లుక్ పోస్టర్లు షేర్ చేసింది.పోస్టర్లు షేర్ చేసిన అడవి శేష్..‘ప్రేమించావు..కానీ మోసం చేశావు..విడిచిపెట్టను.. తేలాల్సిందే’అని క్యాప్షన్ పెట్టారు. దీనికి మృణాల్ స్పందించారు.‘వదిలేశాను..కానీ మనస్ఫూర్తిగా ప్రేమించాను’ అని తెలిపారు.ఈచిత్రానికి కథానాయికగా మొదట శ్రుతి హాసన్‌ను ఎంచుకున్నారు.అనివార్య కారణాల వల్ల ఆమె సినిమా నుంచి వైదొలగారు.ఆమె స్థానంలో ఇప్పుడు మృణాల్‌ను తీసుకున్నారు.
Avunu preminchavu..
Kaani mosam chesavu..!
Idichipettanu..thelchaalsindhe 💥
అవును ప్రేమించావు..
కానీ మోసం చేసావు..!
ఇడిచిపెట్టను…తేల్చాల్సిందే 💥
Get ready for #DACOIT ! @mrunal0801 https://t.co/mpLZxzFyFz pic.twitter.com/RpOglgjeE9
— Adivi Sesh (@AdiviSesh) December 17, 2024