గత ఏడాది విడుదల అయిన ‘ సలార్ ‘ తో ప్రేక్షకులను అలరించారు నటి శ్రియా రెడ్డి. ప్రస్తుతం ఆమె పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తోన్న ‘ ఓజీ ‘ కోసం వర్క్ చేస్తున్నారు.తాజాగా ఒక ఇంటర్వ్యూ లో పాల్గొన్న శ్రియా రెడ్డి ఓజీ విశేషలతోపాటు పవన్ గురించి మాట్లాడారు. “ పవన్ కాంబినేషన్ లో ఇప్పటికే కొన్ని సన్నివేశాలు చేశా.ఆయన చాలా తెలివైన వ్యక్తి…ఎంతో హుందాగా ఉంటారు.మర్యాదగా వ్యవహరిస్తుంటారు.ఆయనొక అద్భుతమైన వ్యక్తి…ఎదుటి వ్యక్తులతో ఆయన ప్రవర్తన,మాట తీరు నన్ను ఎంతగానో ఆకర్షించింది” అని ఆమె చెప్పారు.పవన్ హీరోగా సుజిత్ తెరకెక్కిస్తోన్న సినిమా ‘ఓజీ’.డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై దానయ్య దీనిని నిర్మిస్తున్నారు.ఇందులో ప్రియాంకమోహన్ కథానాయికగా నటిస్తుంది.ఇమ్రాన్ హష్మీ కీలకపాత్ర పోషించారు.ప్రస్తుతం ఈ చిత్రం చిత్రీకరణ దశలో ఉంది.
Previous Articleకార్గిల్ వార్.. ఆ గొర్రెల కాపరి కన్నుమూత…!
Next Article ఏపీలో మద్యం ప్రియులకు జోష్ ఇచ్చే న్యూస్