1999లో జమ్మూకశ్మీర్ లోని కార్గిల్ ఆక్రమణ కోసం దాయాది దేశం పాకిస్తాన్ పన్నిన కుట్రను భారత సైన్యం భగ్నం చేసిన విషయం తెలిసిందే.మన దేశంలోకి చొచ్చుకొచ్చిన పాక్ బలగాలను చిత్తుగా ఓడించి తరిమికొట్టింది.ఈ యుద్ధంలో శత్రువులు చొరబాటును ముందుగా గుర్తించి మన జవాన్లను అప్రమత్తం చేసింది మాత్రం తాషి నామ్యాల్ అనే సామాన్య గొర్రెల కాపరి.తాజాగా ఆయన కన్నుమూశారు.ఈ విషయాన్ని లేప్ లోని ఫైర్ అండ్ ఫ్యూరీ కార్ప్స్ వెల్లడించింది.ఆర్యన్ వ్యాలీలో హఠాణ్మరణం చెందినట్లు తెలిపింది.ఆయన మృతికి గల కారణాలు తెలియరాలేదు.ఆయన మృతిపై సైన్యం దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది.”ఓ దేశ భక్తుడిని కోల్పోయాం.లద్దాఖ్ ధైర్యానికి ఆత్మశాంతి చేకూర 1999 ఆపరేషన్ విజయ్ సమయంలో ఆయన అందించిన సహకారం చరిత్ర పుటల్లో
సువర్ణాక్షరాలతో లిఖించి ఉంటుంది.ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాం” అని ఫైర్ అండ్ ఫ్యూరీ కార్ప్స్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది
Previous Articleసారీ తప్పు నాదే: రష్మిక
Next Article పవన్ కళ్యాణ్ ఒక అద్భుతం: శ్రియా రెడ్డి

