కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత ఆర్థిక వేత్త , మాజీ ప్రధాని, మన్మోహన్ సింగ్ గత రాత్రి తుదిశ్వాస విడిచిన సంగతి తెలిసిందే. కాగా, ఆయన అంత్యక్రియలను పూర్తి అధికారిక లాంఛనాలతో నిర్వహించనున్నట్లు ఇప్పటికే కేంద్రం ప్రకటించింది. రేపు ఆయన అంతిమ కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ తెలిపారు. దీనిపై అధికారిక ప్రకటన చేయనున్నట్లు తెలిపారు. మన్మోహన్ సింగ్ మృతికి సంతాప సూచకంగా కేంద్ర ప్రభుత్వం 7 రోజులు సంతాప దినాలను ప్రకటించింది. రాష్ట్రపతి భవన్ సహా అన్ని ప్రభుత్వ భవనాలపై జాతీయ పతాకాన్ని సగానికి అవనతం చేశారు.
ఏఐసీసీ ప్రధాన కార్యాలయంపైనా జాతీయజెండాను సగానికి అవనతం చేశారు. ఈరోజు కేంద్ర క్యాబినెట్ సమావేశమై ఆయన మృతికి సంతాపం తెలపనుంది. కాంగ్రెస్ పార్టీ కూడా వచ్చే ఏడు రోజుల పాటు కార్యక్రమాలన్నింటినీ రద్దు చేసుకుంది. దేశవ్యాప్తంగా సోషల్ మీడియా వేదికగా మన్మోహన్ సింగ్ మృతికి ప్రముఖుల సహా నెటిజన్లు తమ సంతాపాన్ని వ్యక్తం చేస్తున్నారు. దేశానికి ఆయన చేసిన సేవలు గుర్తు చేసుకుంటున్నారు.
Previous Articleపల్నాడు జిల్లాలో ఏపీ సీఎం చంద్రబాబు పర్యటన ఖరారు
Next Article సీఎం పదవి వద్దన్నా : సోనూ సూద్