అగ్ర రాజ్యం అమెరికా మాజీ అధ్యక్షుడు జిమ్మీ కార్టర్ (100) కన్నుమూశారు.అనారోగ్య కారణాలతో జార్జియాలోని ప్లెయిన్స్ తుదిశ్వాస విడిచినట్లు ఆయన తనయుడు జేమ్స్ ఇ. కార్టర్ 3 తెలిపారు.జిమ్మీ కార్టర్ మృతి పట్ల అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, ప్రథమ మహిళ జిల్ సంతాపం ప్రకటించారు.వ్యాధుల నిర్మూలన, శాంతి స్థాపన, మానవ హక్కుల అభివృద్ధి,స్వేచ్ఛాయుత ఎన్నికలు తదితర అంశాల్లో ఆయన అధ్యక్షుడిగా తనదైన ముద్ర వేశారని బైడెన్ పేర్కొన్నారు.జిమ్మీ మృతి పట్ల
కాబోయే అధ్యక్షుడు ట్రంప్ కూడా సంతాపం తెలిపారు.అధికారిక అంత్యక్రియలకు ఏర్పాట్లు చేస్తున్నట్లు వైట్ హౌస్ తెలిపింది.
Previous Articleశత్రువుల పట్ల అప్రమత్తంగా ఉండాలి…మనం అదృష్టవంతులం కాదు: రక్షణా మంత్రి రాజ్ నాథ్ సింగ్
Next Article తెరుచుకోనున్న శబరిమల ఆలయం…!