రాజస్థాన్‌లోని కోఠ్‌పుత్లీ జిల్లాలో ప్రమాదవశాత్తూ బోరుబావిలో పడిన మూడేళ్ల బాలిక.. ఎనిమిది రోజులుగా మృత్యువుతో పోరాడుతూనే ఉంది.ఆ బాలికను బయటకు తీసుకొచ్చేందుకు సహాయక సిబ్బంది నిర్విరామంగా కృషి చేస్తున్నారు.ఆమెను చేరుకునే క్రమంలో ఓ పెద్ద బండరాయి అడ్డుతగిలింది.దాన్ని ముక్కలు చేసేందుకు రెస్క్యూ సిబ్బంది తీవ్రంగా శ్రమిస్తున్నారు. సోమవారం మధ్యాహ్నానికి రాయిని తొలగించి చిన్నారి ఉన్న ప్రాంతం వద్దకు చేరుకొనే అవకాశం ఉన్నట్లు అధికారులు వెల్లడించారు.
Previous Articleఇకపై అక్కడ నో కిటికీలు: తాలిబన్ ప్రకటన
Next Article అమెరికా మాజీ అధ్యక్షుడి మృతి.. ప్రధాని మోదీ సంతాపం