దేశంలో ఉద్యోగాలు ఈ పదేళ్ల ఎన్డీయే హాయాంలో 36% పెరిగినట్లు కేంద్ర మంత్రి మన్ సుఖ్ మాండవీయ తెలిపారు.
ఎన్డీయే మొదటిసారి అధికారం చేపట్టినపుడు 2014-15లో దేశంలో 47.15 కోట్ల ఉద్యోగాలు ఉండేవని, 2023-24 నాటికి అవి 64.33 కోట్లకు చేరినట్లు పేర్కొన్నారు.
యూపీఏ హయాంలోని 2004-2014 మధ్య పెరిగిన ఉద్యోగాలు 7 శాతమేనని యూపీఏ పాలనలో 2.9 కోట్ల అదనపు ఉద్యోగాలు వస్తే ఎన్డీయే హయాంలో 17.19 కోట్ల కొత్త ఉద్యోగాలు అందుబాటులోకి వచ్చాయని వివరించారు. 2023-24 ఒక సంవత్సరంలోనే 4.6 కోట్ల ఉద్యోగాల కల్పన జరిగిందని తెలిపారు. 2017-18లో 6 శాతంగా ఉన్న నిరుద్యోగ రేటు 2023-24లో 3.2 శాతానికి తగ్గినట్లు పేర్కొన్నారు.
ఇక యూపీఏ హయాంలో పారిశ్రామిక రంగంలో ఉద్యోగాల పెరుగుదల కేవలం 6 శాతంగా ఉండగా… ప్రస్తుత ప్రభుత్వ పాలపలో 15 శాతంగా ఉందని పేర్కొన్నారు. యూపీఏ పాలనలో సర్వీస్ సెక్టార్ ఉద్యోగాలు 25 శాతం పెరిగాయని అదే ఎన్డీయే పాలనలో 36 శాతం పెరిగాయని తెలిపారు. గడచిన ఏడేళ్లలో 4.7 కోట్ల మంది యువజనులు కొత్తగా ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్ లో చేరినట్లు మాండవీయ తెలిపారు.
ఎన్డీయే హయాంలోనే ఎక్కువ ఉద్యోగాల కల్పన: కేంద్ర మంత్రి మాండవీయ
By admin1 Min Read