తనకు ఎన్నిసార్లు దేశం వదిలి వెళ్లి అవకాశం వచ్చినా తాను వెళ్లలేదని పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ అన్నారు.ట్విట్టర్ లో పోస్ట్ పెట్టారు.“నేను అటోక్ జైల్లో ఉన్నప్పుడు మూడేళ్ల కాలానికి దేశం విడిచి వెళ్లిపోయేందుకు అవకాశం వచ్చింది.అందుకు నిరాకరించాను.నేను ఇక్కడే కన్నుమూస్తాను.నా మాట ఎప్పుడూ ఒక్కటే.అదుపులోకి తీసుకున్న మా నేతలు, కార్యకర్తలను విడుదల చేయాలి.ఆ తర్వాత నా వ్యక్తిగత పరిస్థితిపై చర్చించడం గురించి ఆలోచిస్తాను.అలాగే పాక్కు సంబంధించిన
నిర్ణయాలన్నీ స్వదేశంలోనే తీసుకోవాలన్నది నా అభిప్రాయం.ప్రజలకు కనీస స్థాయిలో అందాల్సిన హక్కులు అణచివేతకు గురైతే..అంతర్జాతీయంగా ఉన్న గళాలు బలంగా వినిపిస్తాయి.ఐరాస వంటి సంస్థలు ఉంది అందుకే కదా.మిలిటరీ జోక్యం ఉందని ముషారఫ్ పాలనపై విమర్శలు వచ్చినా..ఈ స్థాయి అణచివేత మాత్రం లేదు” అని షెహబాజ్ ప్రభుత్వం పై ఇమ్రాన్ విమర్శలు చేశారు.
Previous Articleఐఐటీ బాంబే.. కంప్యూటర్లకు నిప్పు పెట్టిన దుండగులు…!
Next Article కాంగ్రెస్, బీజేపీ కుమ్మక్కయ్యాయి: కేజ్రీవాల్