ప్రపంచ దేశాలను వణికిస్తున్న ప్రాణాంతక మంకీపాక్స్ వైరస్ కొత్త వేరియంట్ ఎంపాక్స్ క్లాడ్ ఐబి వ్యాప్తిని తాజాగా కాంగో నుండి చైనాకు వచ్చిన ఓ ప్రయాణికుడిలో కనుగొన్నట్లు చైనీస్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ తెలిపింది. అతనితో సన్నిహితంగా ఉండడం వల్ల నలుగురికి ఎంపాక్స్ కొత్త వేరియంట్ సోకినట్లు వెల్లడించింది. దీంతో డబ్ల్యూహెచ్ఐ హెల్త్ ఎమర్జెన్సీని ప్రకటించింది. ఈ కొత్త వేరియంట్ కాంగో నుండి బురుండి, కెన్యా, రువాండా, ఉగాండాతో సహా పొరుగు దేశాలకు వ్యాపించింది.చర్మంపై దద్దుర్లు, బొబ్బలు రావడం దీని లక్షణాలు. చర్మంపై దద్దుర్లతోపాటు జ్వరం, భరించలేని తలనొప్పి, కండరాల నొప్పి, వెన్ను నొప్పి కూడా ఉంటాయి. ఈ వైరస్ ను 1958లో తొలిసారిగా పరిశోధన కోసం డెన్మార్కు పంపించిన కోతుల్లో కనుగొనడంతో దీనికి మంకీపాక్స్ అని పేరు పెట్టారు.1970లో దీన్ని మనుషుల్లో మొదటి సారిగా గుర్తించారు.
కాంగో నుండి చైనాకు వచ్చిన ఓ ప్రయాణికుడిలో మంకీపాక్స్ వైరస్ కొత్త వేరియంట్
By admin1 Min Read
Previous Articleసైలెంట్‌గా ఓటీటీలోకి వచ్చేసిన ‘మిస్ యు’
Next Article హిందీ జాతీయ భాష కాదు:- అశ్విన్ వ్యాఖ్యలు వైరల్