కేంద్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు లీవ్ ట్రావెల్ కన్సెషన్ (ఎల్టీసీ) కు మరింత వెసులుబాటును కల్పిస్తూ నిర్ణయం తీసుకుంది. తాజాగా తీసుకున్న నిర్ణయం ప్రకారం వందే భారత్, తేజస్, హమ్ సఫర్ ఎక్స్ ప్రెస్ వంటి ప్రీమియర్ ట్రైన్లలోనూ ఎల్టీసీ కింద ప్రయాణించవచ్చు. ఈమేరకు కేంద్రం నేడు ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటి వరకు ఎల్టీసీ కింద ప్రయాణించే ఉద్యోగులు రాజధాని, శతాబ్ది, దురంతో వంటి సూపర్ ఫాస్ట్ ఎక్స్ ప్రెస్ లలో ట్రావెల్ చేయడానికి అనుమతి ఉంది. వందే భారత్ సహా ప్రీమియర్ ట్రైన్స్ లో ఈ పథకం వర్తించదు. వివిధ ప్రభుత్వ సంస్థలు, ఉద్యోగుల నుండి వచ్చిన సూచనలు, విజ్ఞప్తుల పరిశీలించిన మేరకు డిపార్ట్ మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్ (డీఓపీటీ) తాజా నిర్ణయం తీసుకుంది.
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్:ఇక ఆ ట్రైన్లలో కూడా ఎల్టీసీ
By admin1 Min Read
Previous Articleసీఎం చంద్రబాబు అధ్యక్షతన రేపు ఏపీ కేబినెట్ సమావేశం
Next Article సైఫ్‌పై దాడి చిరంజీవి ఏమన్నారంటే