బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్ మీద దాడి జరిగిన విషయం తెలిసిందే.అతడిపై గుర్తుతెలియని వ్యక్తి దాడికి పాల్పడ్డాడు.గురువారం తెల్లవారుజామున ముంబై బాంద్రాలోని ఆయన నివాసంలోకి చొరబడిన దుండగుడు కత్తితో సైఫ్‌పై దాడి చేశాడు.మహారాష్ట్ర మాజీ మంత్రి బాబా సిద్ధిఖీని కాల్చి చంపడం..సల్మాన్ ఖాన్ కు బెదిరింపులు…తాజాగా సైఫ్ పై దాడి నేపథ్యంలో సామాన్యులకు ముంబయి సేఫ్ కాదంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది.దీనిపై ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్ స్పందించారు.సైఫ్ పై దాడి గురించి ఆయన మీడియాతో మాట్లాడారు.సైఫ్ అలీఖాన్‌పై దాడి జరగడం ఆందోళన కలిగించే విషయమే కానీ ఈ విషయం వలన ముంబయిను సురక్షితం కాదని అనడం తప్పు.దేశంలోని అన్ని మెగాసిటీల్లో కెల్లా ముంబయి సురక్షితమైనది. అప్పుడప్పుడు ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయనేది వాస్తవమే.వీటిని నిరోధించడానికి అలాగే భద్రతా చర్యలను పెంచడానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది.ముంబై పోలీసులు సీసీటీవీ ఫుటేజ్ ద్వారా దాడి చేసిన వ్యక్తిని గుర్తించారు.దర్యాప్తు కొనసాగుతోందని ఫడణవీస్ చెప్పారు.
Trending
- ఇంటర్నేషనల్ టీ20లకు రిటైర్మెంట్ ప్రకటించిన కేన్ విలియమ్ సన్
- ఈ ప్రభుత్వం చెత్త నుంచి సంపద వచ్చేలా చూస్తుంది: ఏపీ సీఎం చంద్రబాబు
- త్యాగధనుడు, తెలుగుజాతి సాహసానికి ప్రతీక టంగుటూరికి ఏపీ సీఎం చంద్రబాబు నివాళులు
- గత 14నెలలుగా సమర్థంగా సంస్కరణలు అమలుచేశాం: మంత్రి నారా లోకేష్
- అవినీతిపై ఎన్డీయే ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించబోతోంది: ప్రధాని మోడీ
- కృష్ణా,గోదావరి నదుల్లో వరద ప్రవాహాలపై సీఎం చంద్రబాబు సమీక్ష
- ‘మన శంకరవరప్రసాద్ గారు’…’పండగకి వస్తున్నారు..’ స్టైలిష్ లుక్ లో చిరు
- ఆసియా కప్ లో ఓకే… ద్వైపాక్షిక సిరీస్ లు ఉండవు

