మెడికల్ ఎంట్రెన్స్ టెస్ట్ నీట్-యూజీని ప్రస్తుతానికి ఆఫ్ లైన్లోనే నిర్వహించనున్నట్లు కేంద్రం స్పష్టం చేసింది. ఈ సంవత్సరం కేంద్ర విద్య, వైద్యశాఖల మధ్య విస్తృత చర్చల అనంతరం ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం తెలిపింది. జాతీయ వైద్య కమిషన్ నిర్ణయం ప్రకారం నీట్-యూజీని ఆఫ్ లైన్ విధానంలో ఓఎమ్మార్ షీట్లతో ఒకే రోజు ఒకే షిఫ్టులో నిర్వహించనున్నట్లు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ సంస్థ (ఎన్టీఏ) ప్రకటించింది.
గత ఏడాది నిర్వహించిన ప్రవేశ పరీక్షల ప్రశ్నపత్రాల లీకేజీతో తీవ్ర వివాదం రేగిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో వాటిని సంస్కరించేందుకు ఇస్రో మాజీ ఛైర్మన్ రాధాకృష్ణన్ నేతృత్వంలో ఒక కమిటీని కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఆ కమిటీ ఇచ్చిన పలు సిఫార్సులను పరిగణనలోకి తీసుకుని ఈమేరకు నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
Previous Articleఏపీ క్యాబినెట్ భేటీ:పలు కీలక నిర్ణయాలకు ఆమోదం
Next Article బీజేపీ ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల మేనిఫెస్టో విడుదల…!