భారత విదేశాంగ శాఖ మంత్రి జై శంకర్ పాకిస్థాన్ పై విమర్శలు గుప్పించారు. పాకిస్థాన్ పెంచి పోషించిన ఉగ్రవాదం ఆ దేశానికే ప్రమాదంగా మారిందని దుయ్యబట్టారు. ఉగ్రవాదాన్ని క్యాన్సర్ వ్యాధితో పోల్చారు. ముంబైలో జరిగిన ఒక కార్యక్రమంలో పాల్గొన్న ఆయన పాకిస్థాన్ వైఖరిపై విమర్శలు చేశారు. సీమాంతర ఉగ్రవాదాన్ని పాకిస్థాన్ ప్రోత్సహిస్తోందని అదే వారికి ఇప్పుడు ప్రమాదంగా పరిణమించిందని అన్నారు. అది ఇప్పుడు ఆ దేశ రాజకీయాల్లో కూడా ప్రవేశిస్తుందని పేర్కొన్నారు. ఉగ్రవాదాన్ని అణచివేయాలని భారత్ సహా పలు దేశాలు కోరుతున్నాయని తెలిపారు. అభివృద్ధి చెందుతున్న భారత్ టెక్నాలజీ అందిపుచ్చుకోవాలన్నారు. ఈ విషయంలో వెనుకబాటుకు ఆస్కారం ఉండకూడదని అన్నారు. వెస్ట్రన్ పాలసీకి వ్యతిరేకమైనప్పటికీ వ్యూహాత్మక ప్రయోజనాల కోసం మద్దతిస్తుంది తెలిపారు. భారత్ ను ‘విశ్వబంధు’ గా అభివర్ణించారు. దేశం ప్రయోజనాల దృష్ట్యా వ్యవహారిస్తోందని స్పష్టం చేశారు. భారత్ విశ్వ వేదికపై పరస్పరం స్నేహాన్ని పెంచుకుంటూ నమ్మకమైన భాగస్వామిగా నిలిచిందని పేర్కొన్నారు.
ఉగ్రవాదం క్యాన్సర్ లా ఆ దేశాన్నే కబళిస్తోంది: పాక్ పై కేంద్ర మంత్రి జై శంకర్ విమర్శలు
By admin1 Min Read