అనుమానాస్పద ఫ్రాడ్ కాల్స్ కు సంబంధించి మొబైల్ వినియోగదారులు నేరుగా తమ కాల్ లాగ్స్ నుండి కంప్లైంట్ చేసేందుకు వీలుగా డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికాం సంచార్ సాథీ మొబైల్ అప్లికేషన్ ను ప్రారంభించింది. 2023లో సంచార్ సాథీ పోర్టల్ ను డీఓటీ తీసుకువచ్చింది. తాజాగా మొబైల్ యాప్ ను ప్రారంభించింది. ప్రతి వినియోగదారుని ప్రైవసీ, సెక్యూరిటీని ఈ యాప్ అందచేస్తుంది. ఆండ్రాయిడ్, ఐఓఎస్ లలో లభించే ఈ కొత్త యాప్ అనుమానాస్పద ఫేక్ కాల్స్, మెసేజ్ల గురించి వినియోగదారులు నేరుగా తమ మొబైల్ లాగ్స్ నుండి రిపోర్ట్ చేయవచ్చు. వినియోగదారులు తమ పేరు మీద ఉన్న మొబైల్ కనెక్షన్లను అన్నింటినీ గుర్తించవచ్చు. పోగొట్టుకున్న మొబైల్ ను బ్లాక్ చేయడం, కనిపెట్టడం, స్వాధీనం చేసుకోవడం వంటి ఫీచర్లు కూడా ఈ అప్లికేషన్ లో ఉన్నాయి. నాణ్యమైన మొబైల్ లను వినియోగదారులు కొనుగోలు చేసేందుకు వీలుగా వాటి నాణ్యతను కూడా ఈ యాప్ ద్వారా తెలుసుకోవచ్చు.
Trending
- ఈ ప్రభుత్వం చెత్త నుంచి సంపద వచ్చేలా చూస్తుంది: ఏపీ సీఎం చంద్రబాబు
- త్యాగధనుడు, తెలుగుజాతి సాహసానికి ప్రతీక టంగుటూరికి ఏపీ సీఎం చంద్రబాబు నివాళులు
- గత 14నెలలుగా సమర్థంగా సంస్కరణలు అమలుచేశాం: మంత్రి నారా లోకేష్
- అవినీతిపై ఎన్డీయే ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించబోతోంది: ప్రధాని మోడీ
- కృష్ణా,గోదావరి నదుల్లో వరద ప్రవాహాలపై సీఎం చంద్రబాబు సమీక్ష
- ‘మన శంకరవరప్రసాద్ గారు’…’పండగకి వస్తున్నారు..’ స్టైలిష్ లుక్ లో చిరు
- ఆసియా కప్ లో ఓకే… ద్వైపాక్షిక సిరీస్ లు ఉండవు
- సెలక్షన్ కమిటీ ఛైర్మన్ గా అజిత్ అగార్కర్ పదవీకాలం పొడిగింపు