తాజాగా 47వ అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ బాధ్యతలు స్వీకరించిన సంగతి తెలిసిందే. బాధ్యతలు చేపట్టిన మొదటి రోజే గల్ఫ్ ఆఫ్ మెక్సికో పేరును గల్ఫ్ ఆఫ్ అమెరికాగా మారుస్తూ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ జారీ చేశారు. గల్ఫ్ ఆఫ్ మెక్సికో 16 లక్షల చదరపు కిలోమీటర్ల మేర విస్తరించి ఉంది. ఇది అట్లాంటిక్ మహా సముద్రం, కరేబియన్ సముద్రం, తూర్పు మెక్సికో, ఆగ్నేయ అమెరికా, పశ్చిమ క్యూబా మధ్య ఉన్న ఒక సముద్ర ప్రాంతం. అమెరికా ఆర్థిక వ్యవస్థకు గల్ఫ్ ఆఫ్ మెక్సికో కీలకమైన ప్రాంతం. సముద్రంలో చమురు ఉత్పత్తి చేసే క్షేత్రాల్లో ప్రపంచంలోనే అతి పెద్దది గల్ఫ్ ఆఫ్ మెక్సికో. అమెరికా ముడి చమురు ఉత్పత్తిలో 14 శాతం, 5 శాతం సహజవాయువు ఉత్పత్తి ఇక్కడ నుంచే జరుగుతోంది. అంతే కాకుండా అమెరికాలో వినియోగించే 40 శాతం మత్స్య సంపద ఇక్కడే లభ్యమవుతుంది.
Trending
- ఈ ప్రభుత్వం చెత్త నుంచి సంపద వచ్చేలా చూస్తుంది: ఏపీ సీఎం చంద్రబాబు
- త్యాగధనుడు, తెలుగుజాతి సాహసానికి ప్రతీక టంగుటూరికి ఏపీ సీఎం చంద్రబాబు నివాళులు
- గత 14నెలలుగా సమర్థంగా సంస్కరణలు అమలుచేశాం: మంత్రి నారా లోకేష్
- అవినీతిపై ఎన్డీయే ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించబోతోంది: ప్రధాని మోడీ
- కృష్ణా,గోదావరి నదుల్లో వరద ప్రవాహాలపై సీఎం చంద్రబాబు సమీక్ష
- ‘మన శంకరవరప్రసాద్ గారు’…’పండగకి వస్తున్నారు..’ స్టైలిష్ లుక్ లో చిరు
- ఆసియా కప్ లో ఓకే… ద్వైపాక్షిక సిరీస్ లు ఉండవు
- సెలక్షన్ కమిటీ ఛైర్మన్ గా అజిత్ అగార్కర్ పదవీకాలం పొడిగింపు