రాహుల్ గాంధీ తాజాగా ఢిల్లీ కోటా రోడ్డులో కాంగ్రెస్ పార్టీ కొత్త కార్యాలయంలో పార్టీ శ్రేణులను ఉద్దేశించి మాట్లాడారు.ఆరెస్సెస్,బీజేపీపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.ఈ క్రమంలో ఆయన మాటలతో దిగ్భ్రాంతికి లోనైన ముకేష్ కుమార్ చౌదరి అనే వ్యక్తి తన చేతిలో ఉన్న పాలబకెట్‌ను వదిలేశాడు. దీనితో పాలన్నీ నేలపాలై..అతనికి నష్టం వాటిల్లిందని ఈ షాక్ నుండి తేరుకుని అతను నేరుగా సమస్తిపూర్ పోలీస్ స్టేషన్‌కు వెళ్లి రాహుల్‌గాంధీపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు.రాహుల్ మాటలతో నేను షాక్‌కి లోనయ్యా…నా చేతిలో ఉన్న బకెట్‌ను వదిలేశాను.లీటర్ పాలు రూ.50..మొత్తం రూ.250 నష్టం కలిగింది.రాహుల్ అలా మాట్లాడతారని అనుకోలేదు.దేశ సార్వభౌమత్వాన్ని దెబ్బతీసేలా మాట్లాడినందుకు ఆయనపై కేసు పెడుతున్నట్లు చెప్పాడతను.దీనితో ఈసారి షాక్ తినడం పోలీసుల వంతు అయ్యింది.చేసేదిలేక.. బీఎన్‌ఎస్‌లో పలు సెక్షన్ల ప్రకారం రాహుల్‌పై కేసు నమోదు చేశారు.
ఈ వ్యాఖ్యలపై ఇప్పటికే అసోం రాజధాని గౌహతిలో మోంజిత్ చెటియా అనే వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దేశంలో అశాంతి, వేర్పాటువాద భావాలను రాహుల్ గాంధీ రేకిస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. దేశ సార్వభౌమత్వం, ఐక్యత, సమగ్రతను ప్రమాదంలో పడేసే చర్యలకు ఆయన పాల్పడినట్లు అందులో ఆరోపించారు. దీంతో పలు సెక్షన్ల కింద పాన్ బజార్ పోలీస్ స్టేషన్‌లో రాహుల్ గాంధీపై కేసు నమోదైంది.