మహాకుంభ మేళాలో రష్యాకు చెందిన ‘బాహుబలి బాబా’ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నారు.ఆరడుగుల ఎత్తు,కండలు తిరిగిన దేహం,అందమైన ముఖవర్ఛస్సు ఉండటంతో అందరూ ఆయన్ను ‘బాహుబలి బాబా’ అని పిలుస్తున్నారు.సామాజిక మాధ్యమాల్లో బాగా ప్రాచుర్యం పొందారు.రష్యాలో ఉపాధ్యాయుడైన ఈయన ప్రపంచంలోని చాలా దేశాల్లో టూరిస్టుగా తిరిగారు.ఈ క్రమంలోనే 30 ఏళ్ల క్రితం భారత పర్యటనకు రావడం జీవితాన్ని మలుపు తిప్పింది.సనాతన ధర్మంతో ఇక్కడే ఆయనకు పరిచయం ఏర్పడింది.హిందూధర్మం గొప్పతనాన్ని గ్రహించి వెంటనే దాన్ని స్వీకరించారు.తన పేరును ఆత్మప్రేమ్ గిరి మహరాజ్‌గా మార్చుకున్నారు.భారత్‌లోనే కొంతకాలం ఉండి హిందూ పురాణాలు,ఇతిహాసాలను చదివాక నేపాల్‌కు వెళ్లి అక్కడ సనాతన ధర్మాన్ని ప్రచారం చేస్తున్నారు. కుంభమేళా,మహాకుంభ మేళాలు జరిగినప్పుడల్లా నేపాల్ నుంచి భారత్‌కు వచ్చి వెళ్తుంటారు.


