దేశ రాజధాని ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు సమయం సమీపిస్తోంది.ఈ నేపథ్యంలోనే బీజేపీ ఏర్పాటు చేసిన ఎన్నికల ప్రచారంలో ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఆమ్ ఆద్మీ పార్టీపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు.ఢిల్లీ ఆప్‌కు ఓటమి తప్పదు.అది తెలిసే రోజుకో హామీ ఇస్తోంది. ఆ పార్టీ గతంలో ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో విఫలమైంది.దీనిపై అధికార పార్టీని ప్రజలు ప్రశ్నిస్తున్నారు.ఆప్ మోసాలకు శీష్ మహల్ ఒక ఉదాహరణ.ఢిల్లీ ఎన్నికల్లో కార్యకర్తల వల్లే బీజేపీకు విజయం దక్కుతుంది.ప్రతి పోలింగ్ కేంద్రంలో 50 శాతం ఓట్లు బీజేపీకే పడేలా కార్యకర్తలు ప్రచారం నిర్వహించాలని ప్రధాని మోదీ సూచించారు.
ఢిల్లీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ప్రధాని మోదీ ఆప్‌పై తీవ్ర విమర్శలు
By admin1 Min Read
Previous Articleబీజేపీకి జేడీయూ మద్దతు ఉపసంహరణ..!
Next Article మహా కుంభమేళా చిత్రాలను విడుదల చేసిన ఇస్రో

