ఇనుప యుగం (ఐరన్ ఏజ్) మొదట తమిళనాడులోనే ప్రారంభమైందని, 5,300 ఏళ్ల క్రితమే ఇక్కడ దానిని ఉపయోగించినట్లు శాస్త్రీయంగా నిరూపితమైనట్లు తమిళనాడు సీఎం స్టాలిన్ తెలిపారు. రాష్ట్ర పురావస్తు శాఖ ప్రచురించిన ‘యాంటిక్విటీ ఆఫ్ ఐరన్’ పుస్తకాన్ని తాజాగా ఆయన విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ తమిళనాడులో చేపట్టిన తవ్వకాలు, వాటిని విశ్లేషిస్తే వచ్చిన ఫలితాలను బట్టి తమిళనాడులో 5,300 ఏళ్ల క్రితమే పోత ఇనుము టెక్నాలజీ ఉంది. దీన్నిబట్టి క్రీ.పూ.4,000. నాటికి ఈ ప్రాంతంలో ఇనుప యుగం ఉందని అర్థం చేసుకోవచ్చని వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో తవ్వకాల ద్వారా సేకరించిన వస్తువులను పుణెలోని ఓ పరిశోధనా సంస్థకు, ఫ్లోరిడాలోని అంతర్జాతీయ పరిశోధనా సంస్థకు పంపించినట్లు తెలిపారు . ఆ వచ్చిన ఫలితాల ద్వారా ఈ విషయం వెల్లడైందని వివరించారు. జాతీయసంస్థల సాయంతో తవ్వకాల్లో దొరికిన వస్తువులకు రేడియో కార్బన్ డేటింగ్ ఎనాలిసిస్ చేయించామని సీఎం స్టాలిన్ తెలిపారు. వాటిని బట్టి దక్షిణ భారత ప్రాంతానికి క్రీ.పూ. 3,345 నాటికే ఇనుము పరిచయమైనట్లు తేలిందని పేర్కొన్నారు. భారతదేశ చరిత్ర చెప్పడం తమిళనాడు నుండే మొదలవ్వాలని ఎప్పటినుంచో చెబుతూ వస్తున్నానని సీఎం స్టాలిన్ పునరుద్ఘాటించారు. రాష్ట్ర పురావస్తుశాఖ తవ్వకాలు ఈ కోణంలోనే సాగుతున్నాయని వాటిలో వస్తున్న ఫలితాలు చరిత్ర అధ్యయనాల్లో మలుపులకు కారణమవుతాయని పేర్కొన్నారు. కీలడీ ఓపెన్ ఎయిర్ మ్యూజియం, గంగైకొండ చోళపురం మ్యూజియంకు ఆయన ఈ కార్యక్రమంలో శంకుస్థాపన చేశారు.
Trending
- ఈ ప్రభుత్వం చెత్త నుంచి సంపద వచ్చేలా చూస్తుంది: ఏపీ సీఎం చంద్రబాబు
- త్యాగధనుడు, తెలుగుజాతి సాహసానికి ప్రతీక టంగుటూరికి ఏపీ సీఎం చంద్రబాబు నివాళులు
- గత 14నెలలుగా సమర్థంగా సంస్కరణలు అమలుచేశాం: మంత్రి నారా లోకేష్
- అవినీతిపై ఎన్డీయే ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించబోతోంది: ప్రధాని మోడీ
- కృష్ణా,గోదావరి నదుల్లో వరద ప్రవాహాలపై సీఎం చంద్రబాబు సమీక్ష
- ‘మన శంకరవరప్రసాద్ గారు’…’పండగకి వస్తున్నారు..’ స్టైలిష్ లుక్ లో చిరు
- ఆసియా కప్ లో ఓకే… ద్వైపాక్షిక సిరీస్ లు ఉండవు
- సెలక్షన్ కమిటీ ఛైర్మన్ గా అజిత్ అగార్కర్ పదవీకాలం పొడిగింపు